Sunday, October 24, 2010

కళ్లతో కథ చెబుతా

కళ్లతో కథ చెబుతా


‘‘కళ్లతో కథలు చెప్పే కళ నాకు చిన్నప్పుడే అలవడింది’’ అంటున్నారు శ్రీయ. ఈ బ్యూటీ కథక్ నేర్చుకున్నారు. ఆ విషయం గురించి శ్రీయ చెబుతూ - ‘‘కథక్ అంటే కళ్లతో కథ చెప్పడం అని అర్థం. చెప్పాల్సిన భావాన్ని కళ్లతోనే పలికించాలి. ఈ డాన్స్ నేర్చుకున్నాను కాబట్టి హావభావాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేసినప్పుడు నేను చెప్పదల్చుకున్న భావాన్ని ఎంచక్కా కళ్లతోనే అందరికీ అర్థం అయ్యేట్లు చెప్పగలుగుతున్నాను. కథక్ నా జీవితానికి ఎంతో ఉపయోగపడింది. నా శరీరాకృతి బాగుండటానికి ఒక కారణం ఈ డాన్స్. నేను చిన్నప్పుడు చాలా స్టేజ్ షోలు ఇచ్చాను. 

No comments:

Post a Comment