హిమాలయాలకు రజినీకాంత్
సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రతి ఏడాది హిమాలయాలను సందర్శించడం ఆనవాయితీగా మారింది. భారతదేశంలోనే సంచలన విజయం సాధించి రికార్డు సృష్టించిన రోబో చిత్రం విడుదల దగ్గర్నుంచి రజినీకాంత్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎప్పటిమాదిరిగానే హిమాలయాల్లోని ఓ ధ్యాన మందిరంలో రజినీకాంత్ గడుపుతారని తెలిసింది. ఈసారి పర్యటనలో కైలాసంతోపాటు మానససరోవరాన్ని కూడా సందర్శించనున్నట్లు భోగట్టా. హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత తదుపరి ప్రాజెక్టు గురించి ఆలోచన చేస్తారని రజినీ సన్నిహితులు చెపుతున్నారు.
No comments:
Post a Comment