ఆస్ట్రేలియాలో ఆరెంజ్
మగధీర’తో స్టార్ ఇమేజ్‌ని తెచ్చుకున్న రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆరెంజ్’. జెనీలియా, షాజన్‌పదంసి ఇందులో నాయికలు. బొమ్మరిల్లు, పరుగు చిత్రాల తో అభిరుచి గల దర్శకునిగా ప్రేక్షకులతో కితాబులందుకున్న ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ చిత్రానికి నిర్దేశకుడు. కె.వెంకట్రావు సమర్పణలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కె.నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సిడ్నీలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్రం విశేషాలను నాగబాబు తెలుపుతూ -‘‘‘మగధీర’ లాంటి ఓ సంచలన విజయం తర్వాత చరణ్ ఎలాంటి సినిమా చేస్తే బావుంటుందో... ఎంతో ఆలోచించి... తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ ‘ఆరెంజ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
No comments:
Post a Comment