Thursday, October 14, 2010

వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారట....

వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారట.... 


బాలీవుడ్ నటి దీపికా పదుకునేకి కోపమొచ్చింది. సినిమా సంగతులు కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి విలేకరులు పదేపదే ప్రశ్నించడంపై చిందులేసింది. తాజాగా ఓ షూటింగ్ లో పాల్గొన్న దీపికా పదుకునేను విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. రణబీర్ కపూర్‌తో ప్రేమ విఫలమైన దగ్గర్నుంచి తాజాగా సిద్దార్థ్ మాల్యాతో రొమాన్స్ సాగించడంపై ప్రశ్నలు అడిగారు. పనిలో పనిగా ఓ పిల్లజర్నలిస్ట్.. దీపికకు ఎదురెళ్లి.. మిస్ దీపికా... సిద్దార్థ్ మాల్యాను మీరు ఒళ్లు తగ్గించుకోమని చెప్పారటగా.. అందుకనే ఆయన శరీరంలోని కొవ్వును తగ్గించుకునేందుకు పొద్దస్తమానం జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నాడని అంటున్నారు. నిజంగానే మీరలా చెప్పారా.. అనడిగాడట. దీంతో ఇంతెత్తున లేచిన దీపికా.. నీ ఇష్టం వచ్చింది నువ్వు రాసుకో... ఎవరైనా కాస్త లావుగా కనిపిస్తే ఒళ్లు తగ్గిస్తే బావుంటావని అంటాం. అంతమాత్రాన లింకు పెట్టేయడమేనా..? అయినా అలా "గాలి" వార్తలు రాసేవారికి ఏం పనీ పాటా లేదా.. మంచి వార్తలు రాస్తే అందరూ సంతోషిస్తారు అంటూ... సిద్దార్థ్ మాల్యా దూరంగా విష్ చేస్తూ ఉండటంతో అటువైపు వెళ్లిపోయింది. 

No comments:

Post a Comment