తుపాకీ గుండు దూసుకుపోయింది
షాట్ రెడీ.. టేక్.. అని డెరైక్టర్ అనగానే నీతూచంద్ర పొజిషన్‌లోకి వచ్చారు. ఆమెకు కాస్తంత దూరంలో ఉన్న విలన్ కూడా ఒక వస్తువుకి తుపాకీని గురి పెట్టి నిప్పులు కక్కేలా చూడటం మొదలుపెట్టాడు. నీతూచంద్ర కారులోంచి దిగి పడవ వైపు వడివడిగా అడుగులేయాలి. ఈలోపు ఆ విలన్ తుపాకీతో ఆ వస్తువుని పేల్చాలి. ఆరోజు తీయాల్సిన సీన్ ఇది. డెరైక్టర్ టేక్ అనగానే... నీతూ కారు దిగి పడవ వైపు వెళ్లడం మొదలుపెట్టారు. విలన్ కూడా తుపాకీ ట్రిగ్గర్ నొక్కాడు. కానీ.. గురి తప్పింది. ఆ తుపాకీ గుండు నీతూ చంద్ర పెదాలను ముద్దాడేసింది. బాధ తట్టుకోలేక ఆమె కెవ్వున కేకపెట్టారు. పెదాల నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ సన్నగా విలపించసాగారామె. ఇదంతా జరిగింది తమిళ చిత్రం ‘ఆదిభగవాన్’ షూటింగ్‌లో. థాయ్‌ల్యాండ్‌లో ఇది జరిగింది. ‘జయం’రవి, నీతూ చంద్ర జంటగా అమీర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
No comments:
Post a Comment