Wednesday, October 20, 2010

బ్యాంకాక్‌లో 'మిరపకాయ్' క్లైమాక్స్

బ్యాంకాక్‌లో 'మిరపకాయ్' క్లైమాక్స్


రవితేజ హీరోగా రిచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్లుగా ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై హరీష్‌శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న 'మిరపకాయ్' చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ' బ్యాంకాక్‌లో మంగళవారం నుంచి చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనగా 12 రోజుల పాటు క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం.ఆ తర్వాత యూరప్‌లో 3 పాటల్ని చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుంది. రవితేజ తన బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా, అందరినీ ఎంటర్‌టైన్ చేసే మాస్ కేరెక్టర్‌ని పోషిస్తున్నారు. అన్ని వర్గాల వారిని అలరించే విధంగా  దర్శకుడు హరీష్‌శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

1 comment: