Wednesday, October 27, 2010
'ఆరెంజ్' అన్ని రికార్డుల్ని బ్రేక్ చెయ్యాలని ఆశిస్తున్నా
రాంచరణ్, జెనీలియా జంటగా అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు నిర్మిస్తోన్న 'ఆరెంజ్' చిత్రం పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. సోమవారం రాత్రి శిల్పకళావేదికలో వేలాదిమంది అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగిన వేడుకలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి. రామానాయుడు ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి ప్రతిని చిరంజీవికి అందజేశారు. అంతకుముందు తొలి పాట 'సిడ్నీ నగరం చేసే నేరం'ను నిర్మాత అల్లు అరవింద్, సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ సంయుక్తంగా విడుదల చేయగా, 'పోవే పొమ్మంటే వచ్చేసిందా చెలీ ప్రేమ' అంటూ సాగే రెండో పాటని హీరోలు అల్లు అర్జున్, రానా విడుదల చేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 'ఆరెంజ్' సినిమా హిట్టవ్వాలనీ, రికార్డుల్ని బ్రేక్ చెయ్యాలనీ మీలానే నేనూ ఆశిస్తున్నానంటూ అభిమానుల్ని ఉద్దేశించి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
అప్పారావు శాస్త్రి గతంలొ కామశాస్త్రి అనే బ్లాగులో అడ్డమైన కూతలు కూయడమే కాక అందులో సభ్యసమాజంలో స్త్రీలు తల దించుకునే విధంగా అనేక రకమైన సెక్స్ భంగిమలలో తన సొంత ఫొటోస్ పెట్టాడు. ఆ ఫోటోలు ఎవరి వద్దనైన ఉన్నచో ఆ లింక్ బహిర్గాతపరచగలరు.
ReplyDelete