Tuesday, October 26, 2010

రొమాంటిక్ 'తేనెటీ గ2'

రొమాంటిక్ 'తేనెటీగ2'

 పలు విజయవంతమైన అనువాద చిత్రాలను నిర్మించిన జ్యోతి ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ అందిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తేనెటీగ2'. సాధిక కథానాయికగా నటించిన ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు మొదలయ్యాయి. చిత్రం గురించి దర్శకుడు వి.ప్రసాద్ వివరిస్తూ 'లండన్‌లో చదువుకుంటున్న ముగ్గురు యువకులకు ఓ రోజు ఓ అందమైన యువతి పరిచయమవుతుంది.ఆమె అందానికి దాసులైన ఆ యువకులు ఆమె వెంటపడుతుంటారు. తన భర్తని హత్య చేస్తే ఆ తర్వాత తనతో ఎంజాయ్ చేయవచ్చని ఆ యువతి ఆఫర్ ఇస్తుంది. దాంతో ఆ యువకులు షాకవుతారు. ఇంటికి వెళ్లి బాగా ఆలోచించుకున్న తర్వాత ఆమె భర్తని హత్య చేయలేమనే విషయాన్ని ఆ యువతికి చెప్పడానికి ఆమె ఇంటికి వెళ్లిన ఆ యువకులకు అప్పటికే ఆమె భర్త హత్య చేయబడి ఉండటం గమనించి భయకంపితులవుతారు.అక్కడ నుంచి పారిపోవాలనే ఆలోచన వచ్చినా తన భర్తను హత్య చేస్తే తనతో ఎంజాయ్ చేయవచ్చని ఆ యువతి ఇచ్చిన ఆఫర్ గుర్తుకు వచ్చి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె భర్తని తామే చంపామని, ఎంజాయ్ చేయడానికి తమతో రమ్మని చెబుతారు. వెంటనే ఆ యువతి పోలీసులకు కబురుచేసి, హత్యానేరం కింద ఆ ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేయిస్తుంది.అమాయకులైన ఆ యువకులు ఈ హత్యానేరం నుంచి ఎలా బయట పడ్డారన్నది ఆసక్తి కలిగించే అంశం. సాధిక గ్లామర్ ఈ సినిమాకి ఎస్సెట్ అని చెప్పాలి. యువతను ఆకట్టుకునే అంశాలతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది' అన్నారు. 

No comments:

Post a Comment