Sunday, October 31, 2010

'ద్రోహం' చేసిందెవరు?

'ద్రోహం' చేసిందెవరు?


జయప్రద పిక్చర్స్ సంస్థ తెలుగులోకి అనువదిస్తున్న చిత్రం 'ద్రోహం'. మురుగాస్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఫైనల్ సౌండ్ మిక్సింగ్ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ "ఇది నాయిక ప్రాధాన్యత ఉన్న సినిమా. అందమైన అమ్మాయి కనిపిస్తే వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పరిచయాలు పెంచుకోవాలనుకోవడం పరిపాటే. అలా ఓ సొగసరి వెంటపడిన యువకుడికి ఆమె ఎలా బుద్ధి చెప్పింది? అతని బారి నుంచి ఎలా తప్పించుకుంది? అనేది ఆసక్తికరం. శృంగార నేపథ్యంలో సాగే సినిమా ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ తొలి వారంలో తొలి కాపీ సిద్ధమవుతుంది. సెన్సార్‌ను పూర్తి చేసి వచ్చేనెల రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. మోహన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి రాజ్ కథానాయకుడు. రామ్‌జీ, నిళల్‌గళ్ రవి ఇతర పాత్రధారులు. మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, పాటలు: వెలిదండ్ల, సంగీతం: రాజేష్, కూర్పు: సురేంద్రనాథ్‌రెడ్డి, నిర్మాణం: జయప్రద పిక్చర్స్. 

1 comment:

  1. You are following the cheap tricks played by the present 24hrs news channels....by showing such a nasty pics.

    ReplyDelete