ఆ ఒక్కటీ అడక్కండి
కారు పెద్దదైనా, చిన్నదైనా సరే... నంబర్‌లో మాత్రం ‘4’ అంకె ఉండాలి’’ అని అంటున్నారు సౌత్ నుంచి బాలీవుడ్‌కు ప్రమోట్ అయిన అందాల నటి అసిన్. ఈ తారకు చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టగానే నల్ల పిల్లి ఎదురొచ్చిందనుకోండి వెంటనే ఆ అడుగు వెనక్కి తీసుకుని ఇంట్లోకి చెక్కేస్తారు.
‘‘నావి మూఢ నమ్మకాలు అనుకున్నా ఫర్వాలేదు. నా నమ్మకం నాది’’ అన్నది ఈ బ్యూటీ థియరీ. సంఖ్యా శాస్త్రాన్ని కూడా ఈ అమ్మడు మెండుగా నమ్ముతారు. ఓ ప్రముఖ న్యూమరాలజిస్ట్ ‘నీకు 4 అంకె బాగా కలిసొస్తుందమ్మా’ అన్నారట. అప్పట్నుంచి అసిన్‌కి అవసరమైన చోట 4 అంకెకి ప్రాధాన్యం ఇవ్వడం పరిపాటి అయ్యింది. ముఖ్యంగా కారు నంబర్ల విషయంలో ఏ మాత్రం రాజీపడరు తను. ‘4’ అంకె వచ్చేట్లు నంబర్ తీసుకుంటారు. గత ఐదేళ్లుగా అసిన్ పుట్టినరోజుకి ఆమె తల్లిదండ్రులు మంచి కారు కొని బహుమతిగా ఇస్తున్నారు.
ఒకసారి ఆడి, ఆ తర్వాత బెంజ్.. ఇలా కూతురికి ఖరీదు గల కార్లు కొనిచ్చి ఆమె అమ్మా, నాన్నలు మురిసిపోతుంటారు. తాజాగా అసిన్‌కు బిఎండబ్ల్యు కార్ కొనిచ్చారని సమాచారం. ఈ కారు నంబర్‌లో కూడా 4 అంకె వచ్చేట్లు చూసుకున్నారు అసిన్. 0004, 4000, 400... అసిన్ కారు నంబర్లు ఈ విధంగా ఉంటాయి. న్యూమరాలజీని నమ్మి, ఆచరించిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? అనే ప్రశ్నను ముందుంచితే - ‘‘ఆ ఒక్కటీ అడక్కండి. ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం అన్ని విషయాలు చెప్పేస్తారేంటి’’’ అన్నారు మూతి తిప్పుతూ అసిన్.

No comments:
Post a Comment