ఆ అలవాటు పోవడం లేదు
మమతా మోహన్‌దాస్ చాలా ఆనందంగా ఉంది . దానికి కారణం ‘అన్వర్’ సినిమా. పృథ్వీరాజ్, మమత జంటగా మలయాళంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంపై మమత భారీ అంచనాలు పెంచుకున్నారు. ఆ అంచనాలు నేడు నిజమయ్యాయని ఆమె చెబుతూ - ‘‘అన్వర్ చాలా మంచి చిత్రం. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే చిత్రం ఇది. అందుకే ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ మెండుగా ఉండాలని కోరుకున్నాను,నా కోరిక నెరవేరింది.
మలయాళంలో మమత నటించిన ‘నిరకళ్చా’ చిత్రం ఈ ఆగస్ట్‌లో విడుదలైంది. ఆ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది.
ఇటలీ భాషలోకి కూడా ‘నిరకళ్చా’ను ఇప్పుడు అనువదిస్తున్నారు. ఆ ఆనందంలో ఉన్న మమత ఇప్పుడు ‘అన్వర్’ విజయంతో రెట్టింపు ఆనందంలో ఉన్నారు. ఈ సంతోష సమయంలో గోళ్లు కొరికేసుకుంటున్నారట. చిన్నప్పట్నుంచి మమతాకు గోళ్లు కొరుక్కునే అలవాటు ఉంది. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘గోళ్లు కొరకడం మానమని మా అమ్మ నాతో చిన్నప్పట్నుంచి చెబుతోంది.ఏదైనా మానగలను కానీ అది మాత్రం మానలేను. కాకపోతే నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు మాత్రం ఇబ్బంది అవుతోంది. గోళ్లు కొరుకుతున్నప్పుడు ఆ పెయింట్ మొత్తం నోట్లోకి పోతోంది. అయినా సరే గోళ్లు కొరుకుతూనే ఉంటాను’’ అంటున్నారు మమతా మోహన్‌దాస్.

No comments:
Post a Comment