నాకు వయసు దాచుకోవడం ఇష్టం ఉండదు
‘‘ప్రతిభా, నైపుణ్యాలు ఉన్నంత మాత్రాన విజయం వెంటనే వరించాలనే నిబంధన ఏమీలేదు. ఓపిక అనేది మనిషికి చాలా కీలకమైనది. అది లేకపోతే.. జీవితం గేరుల్లేని బండిగా తయారవుతుంది’’ అంటున్నారు జెనీలియా. తన జీవితంలో ఎదురైన పలు సంఘటనలను నెమరు వేసుకుంటూ జెనీలియా పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘కెరీర్ మొదట్లో నన్నందరూ ఐరన్‌లెగ్ అన్నారు. ఆ మాటకు నేను కృంగిపోతే ఈ రోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు కదా.. ఒక దారిలో నడిచేటప్పుడు చిన్న చిన్న అవరోధాలు సహజంగా ఎదురవుతాయి. అందుకని వాటినే తలచుకొని విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. చిన్నతనం నుంచీ నా తీరు ఇదే. నిరాశ అన్న మూడక్షరాలను నా దరిదాపుల్లోకి కూడా రానియ్యను. బొమ్మరిల్లు’ నాటికీ.. ఇప్పటికీ మీ అందంలో ఏ మాత్రం మార్పు రాలేదని, ఇప్పటికీ టీనేజ్ బ్యూటీగానే ఉంటారని.. చాలామంది అడుగుతుంటారు. నా అందానికి కారణం కూడా ఓ విధంగా క్రీడలే. చిన్నతనం నుంచీ నేను ఆడిన క్రీడలు నేటికీ నా వయసును కనిపించనీయవు. వయసును దాచుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం నా వయసు 27. ఇది నిజం’’ అంటూ ఎంతో ఆసక్తిగా తన గురించి చెప్పుకొచ్చారు జెనీలియా.
No comments:
Post a Comment