Monday, October 18, 2010

టీకా మిస్ అవుతున్నా

టీకా మిస్ అవుతున్నా


మేం ఈ పండగను ‘దసరా టీకా’ అంటాం. పండగ రోజున అన్నదమ్ములకు బొట్టు పెడతాం. నాకు అన్నదమ్ములు లేరు. అందుకని మా కజిన్స్‌కు బొట్టు పెడుతుంటాను. పండగనాడు మా నాన్నగారి అక్కచెల్లెళ్లు మా ఇంటికి వచ్చి నాన్నగారికి బొట్టు పెడతారు. అందరిలానే మా పంజాబీలకు దసరా పెద్ద పండగే. దుర్గాదేవికి పూజలు చేస్తాం. భారీ ఎత్తున వంటకాలు తయారు చేస్తాం. మా బంధువులంతా మా ఇంటికి వస్తారు. ఇంటిల్లిపాదీ కలిసి విందు భోజనం చేస్తాం. ప్చ్.. ఈసారి షూటింగ్‌లో బిజీగా ఉన్నందువల్ల పండగ సంబరాలను మిస్ అవుతున్నాను. ఎనీహౌ.. దసరా పండగ చేసుకుంటున్నవారికి నా శుభాకాంక్షలు.

No comments:

Post a Comment