Friday, October 8, 2010

అమ్మ చెప్పినట్లే జరిగింది

అమ్మ చెప్పినట్లే జరిగింది


బోణి’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి కథానాయికగా పరిచయమైన పంజాబీ భామ కృతి ఖర్బందా. అందమైన ముఖవర్ఛసు. చూడగానే ఆకట్టుకునే ఆ‘కృతి’తో వుండే ఈ తార నటించిన తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా హీరోయిన్‌గా మరికొన్ని అవకాశాలు వరించాయి ఈమెను. కానీ కథానాయికగా పరిశ్రమలో స్థిరపడాలంటే సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేయాలని భావించిన కృతి ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు. తన కెరీర్‌ను మలుపు తిప్పగల మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కృతి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన నటించే లక్కీ చాన్స్‌ను కొట్టేశారు కృతి. బాలీవుడ్‌లో రూపొందిన ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో పవన్ సరసన నాయికగా నటించే అరుదైన అవకాశాన్ని పొందారు.హిందీలో ‘లవ్ ఆజ్‌కల్ ’ సినిమా చూస్తున్నప్పుడు పంజాబీ అమ్మాయి గెటప్‌లో ఉన్న ఆ హీరోయిన్‌ను చూసి ‘ఈ పాత్రకునువ్వు బాగా సరిపోతావు’ అని మా అమ్మ అన్నారు. కాకతాళీయంగా ఇప్పుడు తెలుగు రీమేక్‌లో నేను అదే పాత్రను చేయడం ఎంతో థ్రిల్లింగ్‌గా వుంది.

No comments:

Post a Comment