నవంబర్ రెండో వారంలో 'కళ్యాణ్ రామ్ కత్తి'
నవంబర్ రెండో వారంలో 'కళ్యాణ్ రామ్ కత్తి'
హీరోగా నటిస్తూ యన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తోన్న 'కల్యాణ్‌రామ్ కత్తి' చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మల్లికార్జున్ దర్శకుడు. సినిమా గురించి హీరో, నిర్మాత కల్యాణ్‌రామ్ తెలియజేస్తూ "మణిశర్మ సారథ్యంలో చేసిన పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్స్ చూసిన వాళ్లంతా చాలా బాగున్నాయని ఫోన్లు చేస్తున్నారు. 'అతనొక్కడే' తర్వాత నాకు ఆడియో సూపర్ అనీ, ట్రైలర్స్ బ్రహ్మాండం అనీ ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చింది ఈ సినిమాకే. ప్రేక్షకులు, అభిమానులు ఆశిస్తున్న స్థాయిలో అన్నిరకాల వాణిజ్య అంశాలతో చిత్రం తయారైంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. నవంబర్ 12న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
No comments:
Post a Comment