Friday, October 29, 2010

బిల్‌క్లింటన్‌గా ఇమ్రాన్ హష్మి!

బిల్‌క్లింటన్‌గా ఇమ్రాన్ హష్మి!
 
 
మెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ గురించి ఎవరికీ పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆయన గురించి తెలిసిన వారికి ‘మోనికా లెవిన్‌స్కీ’తో ఆయన సాగించిన ప్రేమాయణం గురించి కూడా అంతే తెలిసి ఉంటుంది. ఆవిడగారు వైట్‌హౌస్‌లో ‘సెక్రటరీ’గా పనిచేశారు. ఆ సమయంలోనే వారి మధ్య ‘పర్సనల్ ఎఫైర్’ సాగింది. ఈ రసవత్తరమైన ఉదంతం ఇప్పుడు సినిమాగా రాబోతుంది.‘ట్రిపుల్ ఎక్స్(గీగీగీ)’ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో బిల్ క్లింటన్ పాత్రను ఇమ్రాన్ హష్మి పోషించనున్నట్లు సమాచారం. కాగా, ఆయన మనసుదోచిన మాయలాడి మోనికా లెవిన్‌స్కీ పాత్రను ఏ హీరోయిన్ పోషిస్తారన్నది తెలియవలసి వుంది. ‘ముద్దుల’ హీరోగా బాలీవుడ్‌లో మంచి పేరు గాంచిన ఇమ్రాన్... క్లింటన్ పాత్రకు ‘భేష్’ అయిన వాడుగా బాలీవుడ్ చెబుతోంది.
 

1 comment:

  1. tollywood latest movies information......news,gossips,latest updates,wallpapers,songs free download

    more information visit:
    http://www.ourtollywood.blogspot.com

    ReplyDelete