హిందీ తారల ఫోన్ నంబర్లు కావాలి
ఈ మాట అంటున్నది మన సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ నిజం. ఆయన వద్ద తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ ఫోన్ నంబర్ తప్ప బాలీవుడ్‌కు చెందిన ఏ హీరో, హీరోయిన్ల నంబర్స్ తన వద్ద లేవట. అదిసరే... రజనీకాంత్‌కి ఇప్పుడు వాళ్ల నంబర్స్ ఎందుకు అవసరం అయ్యాయి అనే విషయానికొస్తే... తను తాజాగా నటించిన ‘రోబో’(తమిళంలో ఎంథిరన్) చిత్రాన్ని ముంబైలో స్పెషల్ స్క్రీన్ చేసి, ఆ స్క్రీనింగ్‌కి కొందరు అగ్ర నటీనటుల్ని ఆహ్వానించాలనుకున్నారు. ఈ పని నిమిత్తం ఇద్దరు తన వ్యక్తిగత సిబ్బందిని ముంబైకి పంపి, బాలీవుడ్ తారల ఫోన్ నంబర్సును కలెక్ట్ చేయమని ఆయన చెప్పినట్లు తెలిసింది.
No comments:
Post a Comment