Wednesday, October 27, 2010

పవన్‌కళ్యాణ్‌తో వినాయక్

పవన్‌కళ్యాణ్‌తో వినాయక్
 
 
ఆసక్తిని, అంచనాలను పెంచే కాంబినేషన్లు కొన్ని ఉంటాయి. అలాంటి కలయికే.. పవన్‌కళ్యాణ్, వి.వి.వినాయక్. హీరోల్లో పవన్‌కళ్యాణ్‌ది, దర్శకుల్లో వినాయక్‌ది జనరంజకమైన శైలి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించే పాత్రలతో యువతరం రోల్‌మోడల్‌గా నిలిచి.. పవర్‌స్టార్‌గా ఎదిగారు పవన్‌కళ్యాణ్.
అలాగే మాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ సినిమాలు రూపొందించి.. సంచలన దర్శకునిగా నిలిచారు వినాయక్. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు అంబరాన్ని తాకుతాయనడంలో సందేహమే లేదు. ఈ అపూర్వ కలయికకు నిర్మాత డి.వి.వి.దానయ్య శ్రీకారం చుట్టారు. త్వరలో వీరిద్దరి కలయికలో ఆయన ఓ సంచలన చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది.

 

No comments:

Post a Comment