‘రోబో’ రికార్డుల పరంపర
రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘రోబో’ ఈ నెల 1న విడుదలై విజయపథంలో దూసుకెళుతున్న విషయం విదితమే. ఈ చిత్రాన్ని దాదాపు 140 కోట్ల రూపాయలతో తీశారు. భారతీయ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇదే. వసూళ్లు కూడా ఇప్పుడు ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఈ చిత్రం తొలి వారం 117 కోట్లు కలెక్ట్ చేసిందట. తమిళనాడులో 60, ఆంధ్ర ప్రదేశ్‌లో 30, కర్నాటకలో 8, కేరళలో 4, హిందీ వెర్షన్ 15 కోట్లు తొలి వారానికి వసూలు చేసి రికార్డ్ సృష్టించిందని వార్తలందుతున్నాయి. ఇటీవల విడుదలైన సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్’ ఈ ఏడాదిలో ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఎక్కువ వసూళ్లు కురిపించిన చిత్రంగా నమోదైంది.
No comments:
Post a Comment