దేవుడా... ఆ రెండు కోరికలు తీర్చు
‘‘స్టార్‌డమ్‌లోని మత్తును, గమ్మత్తును ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నా. ఇది చాలా బావుంది. గొప్ప నటిగా కూడా ఖ్యాతిని ఆర్జించాలని ఉంది. ఇకపై నా పయనం ఆ దిశగానే’’ అంటున్నారు తమన్నా. ‘హ్యాపీడేస్’ ముందు వరకూ ఫెయిల్యూర్స్‌తో చెలిమి చేసిన ఈ అందాలతార.. ‘హ్యాపీడేస్’తో సౌతిండియాలోనే క్రేజ్ స్టార్‌గా ఎదిగారు. ముఖ్యంగా తమిళనాట స్టార్‌డమ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘బద్రీనాథ్’ చిత్రంలోనూ, నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదిలావుంటే.. ఈ పాలబుగ్గల సింగారికి సడన్‌గా ఆఫ్‌బీట్ సినిమాలపై గాలి మళ్లింది. అలాంటి సినిమాల్లో నటించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతూ ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘రిటైర్ అయ్యేలోపు ఒక్కసారైనా కమల్‌సార్, రజనీసార్‌ల సరసన కథానాయికగా చేయాలని ఉంది. ఆ కోరికలని కూడా దేవుడు తీరుస్తాడని నా నమ్మకం’’ అని ఆశాభావం వ్యక్తపరిచారు అందాల తమన్నా.
No comments:
Post a Comment