మధుర మీనాక్షి
ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మధుర మీనాక్షి’. శ్రీ కామాక్షితాయి మూవీమేకర్స్ పతాకంపై రాజవంశీ దర్శకత్వంలో మందలపు హరీష్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ‘‘ సోషియో మైథలాజికల్‌గా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ‘మధుర మీనాక్షి’గా రమ్యకృష్ణ అభినయం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఖర్చుకు వెనుకాడకుండా అత్యాధునిక సాంకేతికతతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దర్శకుడు రాజవంశీయే సంగీతాన్ని కూడా సమాకూర్చారు. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం. ప్రస్తుతం బ్యాలెన్స్‌గా వున్న పాటను చిత్రీకరిస్తున్నాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. నవంబరులో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది.
No comments:
Post a Comment