Saturday, October 30, 2010

పేరు మారాక పేరొచ్చింది

పేరు మారాక పేరొచ్చింది
 
 
నేను.. నా 50 మంది స్నేహితులు చాలా ఆనందంగా గడిపాం. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంత అనుభూతిని నాకు మిగిల్చిన రోజిది’’ అంటున్నారు రిమ్మా. ‘చిత్రం, మనసంతా నువ్వే’లాంటి పలు చిత్రాల ద్వారా తెలుగువారిని ఆకట్టుకోవడంతో పాటు తమిళ్, హిందీ చిత్రాల ద్వారా కూడా ఆయా రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రీమాసేనే ఈ రిమ్మా. పేరు మార్చితే అదృష్టం తన్నుకొస్తుందని ఎవరో చెబితే ‘రిమ్మా’గా
మారిపోయారామె. ‘‘ఆ ఫలితం ‘ఆక్రోష్’ ద్వారా కనిపించింది’’ అంటున్నారు రిమ్మా. ప్రియదర్శన్ దర్శకత్వంలో రిమ్మా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇందులో ఆమె డీ-గ్లామరైజ్డ్ రోల్ చేశారు. తనలో ఇంత మంచి నటి ఉందని మేం ఊహించలేదని బాలీవుడ్ వర్గాలు రిమ్మాని ప్రశంసిస్తున్నాయి. ఈ ప్రశంసలందుకుంటూ ఆనందంలో ఉన్న రిమ్మా శుక్రవారం తన పుట్టినరోజుని కూడా అంతే ఆనందంగా జరుపుకున్నారు.

 

No comments:

Post a Comment