రామ్ హీరోగాబెల్లంకొండ సురేష్ చిత్రం 'కందిరీగ'
రామ్ హీరోగాబెల్లంకొండ సురేష్ చిత్రం 'కందిరీగ'
రామ్ హీరోగా శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించే కొత్త చిత్రం 'కందిరీగ' షూటింగ్ శుక్రవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో మొదలైంది. ఈ చిత్రంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు స్రవంతి రవికిషోర్ క్లాప్‌నివ్వగా, దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఆన్ చేశారు. మరో దర్శకుడు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. నవంబర్ మొదటి వారం నుంచి ఏకధాటిగా హైదరాబాద్, పొల్లాచ్చి, రాజమండ్రిల్లో జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తవుతుందని, హీరోయిన్ ఎంపిక జరుగుతోందని బెల్లంకొండ సురేష్ చెప్పారు.
No comments:
Post a Comment