నా మాజీభర్తపై నాకేం కోపంలేదు.
"7/జి బృందావన్ కాలనీ" చిత్రంతో కుర్రకారు గుండెల్ని పిండేసిన సోనియా అగర్వాల్ ఆ సమయంలో ధనుష్ సోదరుడు... దర్శకుడు అయిన సెల్వరాఘవన్ గుండెను కొల్లగొట్టింది. ఆ విషయాన్ని రాఘవన్ సోనియా వద్ద ఓపెన్ చేసేసరికి అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన సంవత్సరంలోపే రాఘవన్ ఆండ్రియా అనే హీరోయిన్‌ను చూసి చొంగ కార్చుకోవడం, ఆమెతో రాత్రి పార్టీలకు వెళ్లడం మొదలుపెట్టాడు. దీంతో కోపమొచ్చిన సోనియా ఆండ్రియాను పట్టుకుని ఎడాపెడా వాయించినట్లు ఆమధ్య వార్తలు షికారు చేశాయి.ఇంత జరిగినా రాఘవన్ మనసు ఆండ్రియావైపే పరుగులు తీస్తోందని తెలుసుకున్న సోనియా అతడికి విడాకులిచ్చేసింది. తన జీవితం... మాజీభర్త గురించి ఇటీవల హైదరాబాద్‌లో కనబడినప్పుడు అడిగితే... పాస్ట్ ఈజ్ పాస్ట్. రాఘవన్ ఇప్పుడు నా భర్త కాదు... జస్ట్ ఫ్రెండ్. కనబడితే హాయ్ అంటాను.... షేక్ హ్యాండ్ కూడా ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది సోనియా అగర్వాల్.
కుక్కలు
ReplyDelete