‘వేడి’ పుట్టించనున్న బిర్యానీ భామ
కొన్ని పాత్రలు చేయటానికి గట్స్ వుండాలి. ఎటువంటి పాత్రనైనా నేను చేయగలను అనుకున్న వారే ఛాలెంజ్ పాత్రలు చేయటానికి సిద్ధంగా వుంటారు. అందులోనూ కథానాయికలు ఈ విషయంలో పర్టిక్యులర్‌గా వుంటారు. కొంతమంది నాయికలు నేను ఈ పాత్రలే చేస్తాను అని గిరీ గీసుకొని కూర్చుంటే, మరికొంత మంది అభినయానికి ఆస్కారమున్న ఎటువంటి పాత్రలను చేయడానికైనా సిద్ధంగా వుంటారు. ఆ రకంగా ఇటీవల ‘వేదం’ చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఈ కోవలోనే ‘ఆవకాయ్ బిర్యానీ’ ఫేం బిందుమాధవి కూడా చేరనున్నారు. త్వరలో ఆమె ఓ తమిళ చిత్రంలో వేశ్య పాత్రలో నటించనున్నారని సమాచారమ్. ‘ఆవకాయ్ బిర్యానీ’ తర్వాత బంపర్ ఆఫర్, రామ రామ కృష్ణ కృష్ణ, ప్రతిరోజు చిత్రాల్లో నటించినా బిందు కెరీర్‌కు బ్రేక్ రాలేదు. దాంతో పూర్తి అభినయానికి ఆస్కారమున్న పాత్రను చేయాలనుకున్న ఆమె వేశ్య పాత్రను పోషించటానికి అంగీకరించారని తెలిసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాతగా, ఆయన శిష్యురాలు అంజన దర్శకత్వంలో ‘వెప్పం’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. వెప్పం అంటే ‘వేడి’ అని అర్థం. ఇందులో బిందుమాధవిని నాయికగా ఎంపిక చేసుకున్నారట. ఈ చిత్రంలో ఆమె వ్యభిచారిగా కనిపిస్తారని చెన్నయ్ సమాచారం. అయితే ఎటువంటి వల్గారిటీ లేకుండా ఈ పాత్ర వుంటుందని దర్శకురాలు అంజనా చెబుతున్నారు. ఈ చిత్రం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే ఆశతో వున్నారట బిందుమాధవి.
No comments:
Post a Comment