మేం వేశ్యలం కాదు
‘‘నేను మాట్లాడే మాటలు ఘాటుగా ఉండొచ్చు. వాస్తవాలెప్పుడూ అలానే ఉంటాయి. ఫలానా హీరోతో మీరు ప్రేమలో పడ్డారట? ’’ అని పాత్రికేయులు అడిగినప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ ఫీలింగ్ కలుగుతుంది నాకు’’ అంటున్నారు దియా మీర్జా. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ ముంబయ్‌లో సెటిలయ్యారు. పదేళ్ల కెరీర్‌లో ఆమె దాదాపు 35 సినిమాలు చేశారు. కానీ దియా ఖాతాలో విజయాలు తక్కువ. పెపైచ్చు.. అర్షద్ వార్సీతో ప్రేమాయణం సాగిస్తున్నారనే వార్తలు ఒకటి.ఈ వార్తలకే దియా మీర్జా పై విధంగా స్పందించారు. ఆ విషయమై మరింత వివరంగా చెబుతూ - ‘‘సినిమా ఫీల్డ్ అంటే గ్లామర్ కాబట్టి హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేయక తప్పదు. అంత మాత్రాన వాళ్లు మనుషులు కాదని, మనసు ఉండదని అనుకుంటే పొరబాటే. మేం ఒక హీరోతో కలిసి సినిమా చేస్తే ఆ హీరోతో మాకేదో ఉందని అంటగట్టేస్తారు. ఒకవేళ హీరో కాకపోతే దర్శకుడితోనో, నిర్మాతతోనో ఎఫైర్ ఉందంటూ కథలు సృష్టిస్తారు. ఒక్కో సినిమా చేస్తున్నప్పుడు ఒక్కొక్కరితో ప్రేమలో పడటం తప్ప మాకు వేరే పనీ, పాటా ఉండదా? అయినా ఊరికినే మనుషులను మార్చడానికి మేమేం వేశ్యలు కాదు. ఇలా అంటున్నానని మరోలా అనుకోమాకండి. మా గురించి లేని పోని వార్తలు సృష్టించి ప్రచారం చేసినప్పుడు, మా కుటుంబ సభ్యులు బాధపడతారు. వినోదం కోసం ఏ కొంతమందో చేసే ఇలాంటి ప్రచారాల వల్ల మా తల్లిదండ్రులు, బంధువులు బాధపడతారు. అందుకే ఏదైనా వార్త ప్రచారం చేయాలనుకున్నప్పుడు దయచేసి కాస్త ఆలోచించండి. ఆవేశంతో, బాధతో మేం వేశ్యలం కాదు అన్నాను. ఎవరినీ బాధపెట్టాలని అలా అనలేదు. ఎవరి వృత్తి వారిది కాబట్టి ఏ వృత్తి చేసేవారైనా నాకు గౌరవమే’’ అన్నారు.
No comments:
Post a Comment