Sunday, November 21, 2010
గోపిచంద్ కొత్త చిత్రం 'వాంటెడ్'
గోపీచంద్ హీరోగా రచయిత బి.వి.ఎస్.రవిని దర్శకునిగా పరిచయం చేస్తూ భవ్య క్రియేషన్స్ అధినేత వెనిగెళ్ల ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'వాంటెడ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీక్షాసేథ్ చిత్రకథానాయిక. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'గోపీచంద్‌తో 'శౌర్యం' తర్వాత మేం తీస్తున్న సినిమా ఇది. సినిమా చాలా కొత్తగా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో హీరోకి హీరోయిన్ వాంటెడ్. హీరోయిన్‌కి విలన్ వాంటెడ్. విలన్‌కి హీరో వాంటెడ్. అందుకే ఈ సినిమాకి 'వాంటెడ్' అని పేరు పెట్టాం. మూడు పాటలు మినహా చిత్రం పూర్తయింది' అన్నారు. దర్శకుడు రవి మాట్లాడుతూ 'లవ్, ఫ్యామిలీ,యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. గోపీచంద్ కేరెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. మాస్‌తో పాటు యూత్ కూడా లవ్ చేసే విధంగా ఈ పాత్రను తీర్చిదిద్దాం. ఆయన తల్లితండ్రులుగా చంద్రమోహన్, జయసుధ నటిస్తున్నారు. వీరిపై చిత్రీకరించిన ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా కొత్తగా, వినోదాత్మకంగా ఉంటుంది' అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి మాట్లాడుతూ 'డబ్బింగ్ పూర్తయింది. మిగిలిన మూడు పాటలను ఈ నెల 23 నుంచి ఇటలీ, దుబాయ్‌ల్లో చిత్రీకరిస్తాం' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, బెనర్జీ, బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, షఫీ, సుబ్బరాజు, అంజాద్‌ఖాన్, దువ్వాసి, రావి కొండలరావు, రాధాకుమారి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment