Tuesday, November 16, 2010

మహేష్‌తో అనుష్క ‘వేట’

మహేష్‌తో అనుష్క ‘వేట’
ఇటీవల విడుదలైన ‘మహేష్ ఖలేజా’ చిత్రాన్ని చూశారా... ఆ చిత్రంలో జంటగా నటించిన అల్లూరి సీతారామరాజు, సుభాషిణిల జంట ఎలా వుంది..! వారిద్దరి మధ్య నడిచిన సన్నివేశాలు మిమ్ములను నాన్‌స్టాప్‌గా నవ్వించాయి కదూ..? ఆ చిత్రంలో సీతారామరాజు, సుభాషిణిలుగా నటించిన మహేష్‌బాబు, అనుష్క జంట త్వరలో మరో చిత్రంలో కూడా కలిసి నటించనున్నారని సమాచారమ్. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ చిత్రంలో నటిస్తున్న మహేష్ త్వరలో లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ‘వేట’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో అనుష్క కథానాయికగా ఎంపికయ్యారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయకుడు మాధవన్‌తో పాటు నాయిక సమీరారెడ్డి కూడా కీలక పాత్రలను పోషించనున్నారట. ఇంకో విషయం ఏమంటే- ఈ చిత్రంలో తెలుగులో మహేష్ చేస్తున్న పాత్రను తమిళంలో ఆర్య చేస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మహేష్‌తో వెంటనే మరో చిత్రం చేసే అవకాశం రావటం పట్ల స్వీటీ (అనుష్క ముద్దుపేరు) ఆనందంగా వున్నారని సమాచారమ్.
 

No comments:

Post a Comment