Wednesday, November 10, 2010

త్రిష చేయి పట్టుకున్న ఆ కుర్రాడెవరు?

త్రిష చేయి పట్టుకున్న ఆ కుర్రాడెవరు?
ఆ రోజు.. మద్రాసు బీచ్ రోడ్డులో ఒంటరిగా నడిచి వెళ్తోంది త్రిష. ఆమె పయనం ఎక్కడికో ఆమెకే తెలియదు. రోడ్డు చాలా ప్రశాంతంగా వుంది. మనసు కూడా ఎంతో హాయిగా పులకించిపోతోంది. ఆ సమయంలో సడన్‌గా వెనుక నుంచి ఓ వ్యక్తి సైకిల్ మీద వచ్చి, త్రిష చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఆ చేయిని ఆమె ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా ఊఁహూఁ... కుదరలేదు. ఆ తర్వాత ఏం జరిగింది...? అనే కదా మీ సందేహం. ఇదేదో త్రిష నటించిన సినిమాలోని సన్నివేశం అనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే ఇది సినిమాలోని సన్నివేశం కాదు. అలా అని రియల్‌లైఫ్‌లోని సంఘటన కూడా కాదు. తరచుగా నిద్రలో త్రిషకు వచ్చే ‘కల’ అట ఇది. సైకిల్ మీద వచ్చిన వ్యక్తి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆమెకు మెలకువ వస్తోందట. అతని ముఖం ఎలా వుంటుందో చూడాలని ఆమె చాలాసార్లు ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పటి వరకు ఆ కలలో ఆ యువకుడి ముఖం ఎప్పుడూ కనిపించలేదట.ఇటీవల ఓ సందర్భంలో ఈ ఆసక్తికరమైన కల గురించి చెప్పుకొచ్చిన త్రిష... తనకు మరికొన్ని కోరికలు కూడా వున్నాయని చెప్పారు. ‘‘అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సరదాగా షికారు కెళ్ళాలన్నది నా చిరకాల వాంఛ, అలాగే రజనీకాంత్, కమల్‌హాసన్‌ల సరసన నటించాలనే కోరికలో ప్రస్తుతం కమల్ సార్‌తో నటిస్తున్నందున ఓ కోరిక తీరింది. ఇక రజనీకాంత్‌తో నటించాలనే కోరికతో పాటు చెన్నయ్‌లో వున్న ‘కూవమ్’ కాలువలో (ప్రస్తుతం అది మురికికాలువ) ఈత కొట్టాలని (ఆ కాలువ శుభ్రం చేసిన తర్వాతనే సుమా) వుంది. అంతేకాదు... అవకాశం వుంటే మళ్ళీ నా చిన్న నాటి రోజులతో పాటు, కాలేజీ రోజులు కూడా తిరిగిరావాలని వుంది’’ అంటూ చెప్పుకొచ్చారు ఆమె. త్రిష కోరుకుంటున్న ఈ చిత్ర విచిత్రమైన కోరికలు ఎప్పుడు తీరతాయో.. వేచి చూడాలి. మనం కాదు లెండి... త్రిషనే.

No comments:

Post a Comment