కుర్రాళ్లతో క్రేజీ భామ
ఏమాయ చేసావె’ చిత్రంలో హోమ్లీ లుక్‌తో కనిపించి కురక్రారు మనసంతా దోచుకున్న సమంత ఇటీవల విడుదలైన ‘బృందావనం’లో హాట్ హాట్‌గా కనిపించి యువతకు మరింత దగ్గరయ్యారు. ఈ రెండు చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు సమంత. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే సమంత నటించిన తమిళ చిత్రం ‘బానా కాత్తాడి’ని తెలుగులోకి ‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు’ పేరుతో అనువదిస్తున్నారు నిర్మాత శ్రీనివాస్ దామెర.‘హృదయం’ ఫేం మురళి తనయుడు అధర్వ ఈ చిత్రంలో కథానాయకుడు. బద్రి వెంకటేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాలవారు మెచ్చే అంశాలున్నాయి. పరిస్థితులు ప్రేమికుల మధ్య అపార్థాలకు కారణం అయినా స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి వుండదు అనేది ఈ చిత్రం ఇతివృత్తం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: వెన్నెలకంటి.
No comments:
Post a Comment