కథలో "ఖలేజా" ఉంటే మేమిద్దరం రెడీ అంటున్న ప్రిన్స్, పులి
మల్టీస్టారర్ చిత్రాల సీజన్ మళ్లీ మొదలుకానున్నది. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబు కలిసి నటించేందుకు తమ సంసిద్ధతను తెలియజేసినట్లు భోగట్టా. కథాబలం ఉంటే ఇద్దరూ కలిసి నటించేందుకు సిద్ధమని చెప్పారు.వీరిద్దరి అంగీకారం తెలియజేయడంతో ఓ అరడజను రచయితలు కథలతో వారి ముందు వాలేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ ఫిలిమ్ నగర్ వార్త. ఈ కథలలో ఏ ఒక్కటి నచ్చినా పవన్ కల్యాణ్ - మహేశ్ బాబు చిత్రం తెరపైకి రావడం ఖాయం.మరోవైపు యువరత్న బాలకృష్ణ తన అన్న కుమారుడు కల్యాణ్ రామ్‌తో కలిసి నటించేందుకు రెడీ అన్నట్లు సమాచారం. మొత్తమ్మీద 2011 నుంచి మల్టీస్టారర్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులు చూడవచ్చన్నమాట.
No comments:
Post a Comment