Wednesday, November 3, 2010

ఎక్కడైనా భర్తకానీ...

ఎక్కడైనా భర్తకానీ...
 
అమీర్‌ఖాన్ నటించిన ‘ధోబీ ఘాట్’ చిత్రం అతనికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో మనకు తెలిసిందే. ఆ చిత్రంలో అతను ‘పెయింటర్’గా నటించాడు. ఈ చిత్రానికి దర్శక, నిర్మాత ఎవరో గుర్తుంది కదా..? ‘కిరణ్‌రావ్’. ఆమె అమీర్‌ఖాన్‌కి సతీమణి. ఇప్పుడెందుకు ఈ సినిమా గురించి చెప్పుకోవడం అనే సందేహం రావొచ్చు. ‘ధోబీఘాట్’కి అమీర్‌ని సెలక్ట్ చేసేముందు కిరణ్‌రావు అతనికి స్క్రీన్ టెస్ట్ నిర్వహించారట. ఆ కేరక్టర్‌లో ఆయన సూట్ అవుతారో లేదో పరీక్షించి, ఆతర్వాతనే ఆ సినిమా చేయాలనుకున్నారట ఆమె. కొత్తవాళ్లకు టెస్ట్ పెట్టినట్టు ఆమె అమీర్‌ఖాన్‌కి టెస్ట్ పెట్టారనమాట. దీనినే సినీ పరిభాషలో ‘ఆడిషన్’ అంటారు. ఆలిండియాలో ‘సూపర్‌స్టార్’గా వెలుగొందుతున్న ఒక హీరోని పట్టుకుని ఓ కొత్త ఆర్టిస్టు మాదిరి టెస్ట్ పెట్టడమంటే మనకు వింతగానే అన్పిస్తుంది.అందులోనూ భర్తగారిని భర్యామణి పరీక్షలో నిలపడం! ఆమె అలా జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టే ఆ సినిమాలోని కేరక్టరుకు అమీర్‌కు అంతగా పేరొచ్చింది. 2010 టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడి ప్రశంసలందుకుంది.

1 comment: