ఒకే ఒక్క కారణంతో అతన్నుంచి విడిపోయా
‘‘మగాడి కళ్లు... కంట కనబడిన ప్రతి అమ్మాయి వైపు వెళితే.. అతన్ని ప్రేమిస్తున్న అమ్మాయికి ఒళ్లు మండుద్ది. రణబీర్ కపూర్ విషయంలో నాకలానే ఉండేది’’ అంటున్నారు క్యూట్ గాళ్ దీపికా పదుకొనే. ‘బచ్‌నా ఏ హసీనో’ చిత్రంలో కలిసి నటించినప్పుడు రణబీర్, దీపికా మధ్య ప్రేమ చిగురించింది. దేహాలు వేరైనా మనసు మాత్రం ఒకటేనని, నువ్వెక్కడుంటే నేనక్కడుంటానని... ఇలా ఎన్నో ప్రేమ ఊసులు చెప్పుకున్నారు ఈ ప్రేమికులు. అంతగా ప్రేమించిన రణబీర్ నుంచి ఎందుకు దూరమయ్యారు? అనే ప్రశ్నను దీపికా పదుకొనే ముందుంచితే - ‘‘రణబీర్‌కి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని నా ఫీలింగ్. అతన్ని దగ్గరగా గమనించడం మొదలుపెట్టిన తర్వాత ఈ విషయం తెలుసుకున్నాను. ఏ అమ్మాయితో పడితే ఆ ఆమ్మాయితో మాటలు కలిపేసేవాడు. దాంతో నేను అభద్రతాభావానికి గురయ్యాను. అతనికి దూరంగా ఉన్నప్పుడు.. ‘ఇప్పుడు రణబీర్ ఏం చేస్తున్నాడో? ఏ అమ్మాయితో తిరుగుతున్నాడో?’ అనే ఫీలింగ్ కలిగేది. ప్రతిసారీ ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? అంటూ చెక్ చేయలేను కదా. ఒకవేళ అతనితో కలిసి ఉంటే జీవితాంతం నేను అనుమానంతో సతమతమవ్వాల్సి వచ్చేది. రణబీర్ ప్రవర్తన సరిగ్గా ఉంటే నేనెందుకు అనుమానిస్తాను? నా కళ్ల ముందే అతను వేరే అమ్మాయిలతో క్లోజ్‌గా ఉండేవాడు. ప్రేయసికి నమ్మకం చేకూర్చలేని మగాడూ ఒక మగాడేనా? అనిపించింది. అతన్నుంచి విడిపోవడానికి ప్రధాన కారణం ఇదే’’ అన్నారు. రణబీర్ నుంచి విడిపోయిన తర్వాత అతని గురించి ఆలోచించడం మానేశానని, పగ, ప్రతీకారాల్లాంటివేమీ లేవని కూడా ఆమె స్పష్టం చేశారు.
No comments:
Post a Comment