Wednesday, November 24, 2010

ముద్దుకు ససేమిరా అన్నా...

ముద్దుకు ససేమిరా అన్నా...
 ముద్దు సన్నివేశాలు సాధారణమైపోతున్న ఈ రోజుల్లో అలాంటి సన్నివేశాల్లో నటించనని నటి రియా అంటున్నారు. నూతన నటుడు జితీష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం తలకోణం. ఇందులోఅతనికి జంటగా నటి రియా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సముద్ర కని శిష్యుడు కె.పద్మరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను ఆయన తెలుపుతూ మంత్రి కుమార్తె రియా కళాశాల విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళుతుందన్నారు. మరో కళాశాలలో చదువుతున్న హీరో జితేష్ తమబృందంతో తలకోన చేరుకుంటాడని తెలిపారు. అయితే అక్కడ వారిని అంతర్జాతీయ తీవ్రవాదులుకిడ్నాప్ చేస్తారన్నారు. జైలులో బంధీగా ఉన్న తమ సహచరుల్ని విడుదల చేస్తేనే మంత్రి కుమార్తెనుప్రాణాలతో విడిచిపెడుతామని హెచ్చరిస్తారు. అదే సమయంలో మంత్రి కుమార్తె రియాను మరోముఠాకు చెందిన వారు కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్‌తో పాటు వారి బృందాన్ని ఎలా కాపాడాడు? హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా మొలకెత్తింది? వారిప్రేమ సఫలం అయిందా? అనేది కథ అని తెలిపారు. ఒక సందర్భంలో హీరో హీరోయిన్లు లిప్‌లాక్ సన్నివేశం చోటు చేసుకుంటుందన్నారు. ఆ సన్నివేశంలో నటించడానికి హీరోయిన్ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. సన్నివేశం ప్రాముఖ్యతను వివరించగా చివరికి ముద్దుకు అంగీకరించిందని తెలిపారు.అయితే ఇలాంటి సన్నివేశం చిత్రంలో మరోసారి కూడా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు.
 

No comments:

Post a Comment