పవన్‌కళ్యాణ్‌తో విష్ణువర్థన్
సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకునే పవన్‌కళ్యాణ్ ఈ సారి తన పంథా మార్చారు. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే జయంత్, సింగీతం శ్రీనివాసరావుల దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆయన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో... సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ కలిసి నిర్మించనున్నారు. 2011 ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలు కానుంది. యువన్‌శంకర్‌రాజా సంగీతం అందించబోతున్నారు. పవన్‌కళ్యాణ్ చిత్రానికి యువన్ స్వరాలు అందించడం ఇదే ప్రథమం అవుతుంది. గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చనుండటం విశేషం. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారు. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ చాలా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్టయిలిష్‌గా ఉంటూనే, అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, రచన: రాహుల్ కోడా, సంభాషణలు: క్రిష్, కళ: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, నిర్మాతలు: నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విష్ణువర్థన్.
No comments:
Post a Comment