అతను మసాజ్ చేస్తుంటే గాల్లో తేలిపోయాను
‘‘నా పాదాలకు ఉపశమనం లభించేట్లుగా అడపా దడపా బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ‘ఫుట్ మసాజ్’ చేయించుకుంటాను. కానీ ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. ఇమ్రాన్‌ఖాన్ ముందు బ్యూటిషియన్లు బలాదూర్’’ అంటున్నారు సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనే. ఇమ్రాన్‌ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం ‘బ్రేక్ కే బాద్’. ఈ నెలాఖరున చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో దీపికా పాదాలకు ఇమ్రాన్ మసాజ్ చేసే సన్నివేశం ఒకటుంది.
ఆ సీన్ చిత్రీకరణ చాలా సరదాగా జరిగిందని ఈ బ్యూటీ అంటున్నారు. ఇమ్రాన్ తన పాదాలు పట్టుకోగానే దీపికాకు నవ్వొచ్చేసిందట. గిలిగింతలు పెట్టినట్లు అనిపించిందని ఆమె అంటున్నారు. ఈ సీన్ గురించి దీపికా చెబుతూ - ‘‘చిత్రదర్శకుడు ధనీష్ అస్లామ్ ఈ సన్నివేశం గురించి చెప్పగానే నాకు భలే నవ్వొచ్చింది. నా కాళ్లు పట్టుకుంటావా? అని ఇమ్రాన్‌ని ఏడిపించాను. తను కూల్‌గా నవ్వేశాడు. సీన్ తీసేటప్పుడు అది షూటింగ్ అని మర్చిపోయాడో ఏమో.. నిజంగానే నా పాదాలకు మసాజ్ చేశాడు. నాకైతే గాల్లో తేలిపోయినట్లు అనిపించింది. నేను కూడా అది షూటింగ్ అని మర్చిపోయి మసాజ్‌ను హాయిగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా. మేం అలా ఇన్‌వాల్వ్ కావటమే మా దర్శకుడికి కావాలి. సీన్ బాగా వచ్చిందని తెగ పొగిడేశారు. నిజం చెబితే నమ్మరు. నేను ఎంతోమంది బ్యుటిషియన్ల దగ్గర ఫుట్ మసాజ్ చేయించుకున్నాను. కానీ ఇమ్రాన్ చేసినంత బాగా ఎవరూ చేయలేదు’’ అంటున్నారు.
No comments:
Post a Comment