దమ్ము కొట్టడం తెలియదు
అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే అనే మాట హాటెస్ట్ తార నీతూ చంద్ర వ్యవహారాన్ని గమనిస్తే నిజమేననిపిస్తుంది. అసలు సంగతేంటంటే... ఇటీవల నీతూచంద్ర ఓ తమిళ సినిమా షూటింగ్‌లో భాగంగా దమ్ము కొట్టాల్సిన సీనులో నటించాల్సి వచ్చింది. దర్శకుడు నీతూకు బ్రాండెడ్ సిగార్ ఇచ్చి గట్టిగా ఓ దమ్ము లాగి వదలమన్నాడు. నీతూ దర్శకుడు మాట విని... అబ్బెబ్బే.. నాకసలు అటువంటి అలావాటే లేదు. సిగరెట్‌ను నేను ముట్టుకుని ఎరుగను. నో.. నో.. నేను చేయలేని అందట. అయితే సన్నివేశం డిమాండ్ మేరకు దమ్ముకొట్టాల్సిందేనని దర్శకుడు పట్టబట్టడంతో ఏమీ చేయలేని నీతూచంద్ర సిగరెట్‌ను తీసుకుని పొగ గుప్పుగుప్పును వదలడం మొదలుపెట్టిందట. దర్శకుడు అడక్కపోయినా సన్నివేశం బాగా రావడానికి మరిన్ని షాట్లు తీసుకోమని 30 సిగరెట్లను వరుసబెట్టి ఊదిపారేసిందట.
No comments:
Post a Comment