Monday, November 15, 2010

హీరోలను పట్టించుకోను

హీరోలను పట్టించుకోను

 'సినిమాకు సంతకం చేసే ముందు నేను ఆలోచించేది కథ గురించే. కథ బాగుండి అందులో నా పాత్ర నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తాను'' అని అంటోంది మలయాళ ముద్దుగుమ్మ అసిన్.బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరిక్షించుకుని తిరిగి చెన్నై చేరుకున్న ఈ కేరళ కుట్టి తన గురించి ఇలా చెప్పుకొచ్చింది. "కథ, నా పాత్ర తర్వాత నేను ఆరా తీసేది దర్శకుడు గురించి. నేను నటిస్తున్న సినిమాలో హీరో ఎవరన్న విషయం మీద నేనెప్పుడూ ఆసక్తి చూపను.ఎవరైనా చెబితే వింటానే తప్ప ఆ వివరాలను పట్టించుకోను'' అని తెగేసి చెప్పేసిందీ సుందరి. అన్నట్టు ఎరుపు, నలుపు రంగులంటే ఈ బ్యూటీకి ప్రాణమట. "అమ్మా నాన్న నా రోల్ మోడల్స్. అమ్మకు ఎరుపు అంటే ఇష్టం. నాన్నకు నలుపంటే ఇష్టం. అందుకే నాకు ఆ రెండురంగులంటే ప్రాణం'' అని వివరించింది అసిన్. 

No comments:

Post a Comment