డిసెంబర్ 5న 'మిరపకాయ్'ఆడియో
డిసెంబర్ 5న 'మిరపకాయ్'ఆడియో
రవితేజ హీరోగా హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుష్పాల నిర్మిస్తున్న 'మిరపకాయ్' చిత్రం ఆడియో డిసెంబర్ 5న, సినిమా అదే 23న విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాత వెల్లడిస్తూ 'మా చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది.హైదరాబాద్, రాజమండ్రి, స్విట్జర్లాండ్, బ్యాంకక్‌లో చాలా లావిష్‌గా చిత్రీకరించాం. రవితేజ ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్, హరీష్‌శంకర్ టేకింగ్, థమన్ మ్యూజిక్, రాంప్రసాద్ ఫొటోగ్రఫీ మా సినిమాకి హైలైట్స్‌గా నిలుస్తాయి. మిరపకాయ్ టైటిల్‌కు తగ్గట్లుగానే రవితేజ పాత్ర ఉంటుంది. పాటలు బాగా వచ్చాయి. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన క్లైమాక్స్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది.వచ్చే నెల 5న ఆదిత్య సంస్థ ద్వారా ఆడియోను విడుదల చేస్తున్నాం. అలాగే డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు చిత్రంలో ఉన్నాయి' అన్నారు. దర్శకుడు హరీష్‌శంకర్ మాట్లాడుతూ 'రవితేజ నుంచి ఏ తరహా చిత్రాన్ని ఆయన అభిమానులు, ప్రేక్షుకులు కోరుకుంటారో దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుంది' అన్నారు.
No comments:
Post a Comment