సెన్సార్‌వారి మెడపై కత్తి పెట్టా
‘‘సెన్సార్‌వాళ్లను తప్పుకొని మీ ‘రక్త చరిత్ర’ ఎలా బయటకొచ్చింది...? అని విలేకరులు అడిడితే...‘‘సెన్సార్‌వారి మెడపై కత్తి పెట్టా... దాంతో వదిలేశారు’’ అని తాపీగా సమాధానం చెప్పారు వర్మ. ఇలాంటి చిత్రమైన ప్రశ్నలతో, విచిత్రమైన సమాధానాలతో గమ్మత్తుగా రామ్‌గోపాల్‌వర్మ ‘రక్త చరిత్ర-2’ ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. రామ్‌గోపాల్‌వర్మ ఆడియో సీడీని ఆవిష్కరించి హీరో సూర్యకు అందించారు. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ-‘‘ఇందులో హీరోలు, విలన్లూ ఉండరని, కథను బట్టే పాత్రలన్నీ నడుచుకుంటూ ఉంటాయనీ ‘రక్త చరిత్ర’ మొదలైన నాటి నుంచీ చెబుతూనే ఉన్నాను. నా మాటలోని వాస్తవం ‘రక్తచరిత్ర-2’ చూస్తే అందరికీ అవగతం అవుతుంది. ఈ ద్వితీయ భాగం సూర్య నేపథ్యంలో సాగుతుందని తెలిసిందే. నేను ఈ పాత్రకు సూర్యను ఎంపిక చేయడానికి కారణం ఆయనలోని నటనా పటిమే. కళ్లతోనే భావాలు పలికించగల ప్రతిభ సూర్యకు సొంతం. కారాగారంలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల్లో ఆయన కళ్లతో పలికించిన భావాలు దర్శకుడిగా నేనే మరిచిపోలేకపోయాను. ఇమేజ్‌ను పక్కనపెట్టి ఈ సినిమాలో నటించారాయన. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ నెల 26న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘కథను నడిపించే రెండు ముఖ్యమైన పాత్రల్లో నా పాత్ర కూడా ఒకటి. అంతే కానీ ఇందులో నేను, వివేక్ కథానాయకులం కాదు... ప్రతినాయకులం అంతకన్నా కాదు.
ఎన్నో ఏళ్ల నుంచి రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించాలని కలలు కన్నాను. ఆ కల ఇన్నాళ్లకు రక్తచరిత్ర ద్వారా నెరవేరింది. నా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు’’ అని సూర్య చెప్పారు. ఇంకా మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్, చిన్నా వాసుదేవరెడ్డి, రాజ్‌కుమార్, మధుర శ్రీధర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:
Post a Comment