Monday, November 29, 2010

వాళ్లను చూస్తే అసూయ కలిగింది

వాళ్లను చూస్తే అసూయ కలిగింది
 పస్తుతం దక్షిణాదిన అత్యధిక చిత్రాల్లో నటిస్తున్న నాయిక అనుష్క. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతున్నారామె. ఓ వైపు సినిమాలు, మరో వైపు సేవాకార్యక్రమాలు..! ఇదీ అనుష్క లైఫ్ స్టైల్. ఈ విషయంలో మీకు స్ఫూర్తి ఎవరు..? అని అనుష్కను అడిగితే మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తీ నాకు స్ఫూర్తిప్రదాతే అని సమాధానమిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘దేవుడు ఇంద్రధనుస్సులాంటి జీవితం ఇచ్చాడు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకని లైఫ్ ఇది. అలా దేవుడిచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే... మనంత స్వార్థపరులు ప్రపంచంలో మరొకరు ఉండరని నా అభిప్రాయం. ఈ అభిప్రాయం నాకు కలగడానికి ఓ బలమైన కారణమే ఉంది. ఈ మధ్య ఓ వికలాంగుల పాఠశాలకు వెళ్లాను. అక్కడ పిల్లల్ని చూస్తే బాధ అనిపించింది. కానీ ఆ బాధ కాసేపే. కొంతసేపు వాళ్లతో గడిపిన తర్వాత వాళ్లను చూస్తే ఈర్ష్య కలిగింది. వాళ్లందరూ మాకంటే చాలా ఆనందంగా ఉన్నారన్న విషయం వారితో కాసేపు గడిపాక కానీ అర్థంకాలేదు. దేవుడు ఒకటి తీసుకుంటే... అంతకు పదంతలు శక్తిని ఇస్తాడని చిన్నప్పుడు అమ్మ చెప్పేది. వాళ్లను చూసిన తర్వాత అది నిజం అనిపించింది. ఆ క్షణమే వారికోసం ఏదైనా చేయాలన్న భావన మొదలైంది. అందుకే... సినిమాలతో పాటు... అలాంటి వారి సేవ కూడా నా జీవితంలో ఓ భాగంలా చేసుకున్నాను’’ అని చెప్పారు అనుష్క.

No comments:

Post a Comment