Thursday, November 18, 2010
ఎన్టీఆర్ హీరోగా సినిమా ప్రారంభం
'అదుర్స్', 'బృందావనం' చిత్రాల విజయానందంలో ఉన్న ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కిక్' ఫేమ్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రొడక్షన్ నెం.2 బుధవారం ఉదయం సంస్థ కార్యాలయంలో జరిగింది. ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా, వి.వి.వినాయక్ స్విచ్ ఆన్ చేశారు.దేవుని పటాలపై చిత్రించిన ముహూర్తపు షాట్‌కు ఎస్.ఎస్.రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ "ఎన్టీఆర్‌తో ఓ భారీ చిత్రం తీయాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరుతోంది. ఎన్టీఆర్‌కు కచ్చితంగా సరిపోయే సబ్జెక్ట్ ఇది. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి జనవరి 8 నుంచి ఏకధాటిగా షెడ్యూల్ చేస్తాం. మా సంస్థకు ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది'' అని అన్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ "నవంబర్ 16కి తారక్ హీరో అయి పదేళ్ళు పూర్తయింది.17న ఈ చిత్రం ప్రారంభంతో మరో దశాబ్దానికి నటుడిగా శ్రీకారం చుట్టాడు. ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, ఈ చిత్రం మరో ఎత్తు. ఇందులో కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు. తారక్ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే సరికొత్త టైప్‌లో సాగే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అవుతుంది. ఎన్టీఆర్ సరసన తమన్నా నటించనుంది. మరో నాయిక ఎంపిక జరుగుతోంది. ఈ సంస్థలో ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది'' అని అన్నారు.కిక్ శ్యామ్, ప్రకాష్‌రాజ్, ఆశిష్ విద్యార్థి, అలీ,జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, దువ్వాసి మోహన్, రఘు కారు మంచి, వెంకట్ తదితరులు ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, పాటలు: చంద్రబోస్, సహ నిర్మాత: బి.బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment