Tuesday, November 9, 2010
నాకెరీర్‌లో అతి పెద్ద విజయం'బృందావనం'
'బృందావనం' చిత్రం తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయమని హీరో ఎన్టీఆర్ అన్నారు. క్లాస్ సినిమాలు చెయ్యలేరా, లవర్‌బాయ్ పాత్రలు చెయ్యలేరా.. అన్న అభిమానుల కోరికని ఈ సినిమాతో తీర్చానన్నారు. ఆదివారం రాత్రి శిల్పకళావేదికలో 'బృందావనం' చిత్రం ఆడియో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక ఘనంగా జరిగింది. దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, వి.వి. వినాయక్ చేతుల మీదుగా ప్లాటినమ్ డిస్క్ జ్ఞాపికని ఎన్టీఆర్ అందుకున్నారు.వినాయక్ మాట్లాడుతూ "అతి శక్తిమంతమైన నందమూరి తారకరామారావు అనే పేరుని మోస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కృష్ణుడిలా మారాడు. కొత్త కొత్త క్యారెక్టర్లు చేస్తూ హీరోగా మరింత ఎత్తుకు ఎదగాలి. ఎన్టీఆర్ ఎనర్జీకి నేనూ, రాజమౌళి కలిసి ఓ సినిమాకి పనిచేస్తే కరెక్టుగా ఉంటుంది'' అని చెప్పారు. రాజమౌళి మాట్లాడుతూ "ఈ సినిమా విజయంలో ఎన్టీఆర్ పాత్రకంటే నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి పాత్ర ఎక్కువ. టెర్రిఫిక్ మ్యూజిక్ ఇచ్చిన తమన్‌కీ ఈ సినిమా విజయంలో భాగముంది. వినాయక్, నేను, తారక్‌తో పాటు బాలయ్య కూడా తోడైతే ఆ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది'' అన్నారు.చివరగా అభిమానుల్ని ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడుతూ "మీరు లేకపోతే మేం లేం. మా కుటుంబం లేదు. నా కెరీర్‌లో 'బృందావనం' బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. కోట, ప్రకాశ్‌రాజ్ వంటి గొప్ప నటులతో చేయడం సంతోషంగా ఉంది. చెప్పినదానికంటే సినిమాని బాగా తీశాడు వంశీ. ఈ సినిమాతో తమన్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. రాజమౌళి, వినాయక్ నాతో సినిమాలు చేయొద్దు. ఇప్పటికే వాళ్లు నాతో చెరో మూడు సినిమాలు చేశారు. వాళ్లు చెయ్యాల్సింది బాలయ్యతో'' అని వాళ్లచేత చేస్తామనిపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment