Tuesday, November 23, 2010

మా పెళ్లి కూడా చేసేశారు

మా పెళ్లి కూడా చేసేశారు

స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం ఫ్రీదా పింటో ఆ చిత్రంలో నటించిన దేవ్ పటేల్‌తో ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారన్నది తాజా వార్త. ఈ విషయం గురించి ఫ్రీదా స్పందిస్తూ - ‘‘కొంతమందికి పనీ పాటా ఉండదనుకుంటా. ఫ్రీదా పింటా, దేవ్ ఫలానా రెస్టారెంట్‌కు వెళ్లారు.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూశారు.. చేతిలో చెయ్యేసుకుని పార్కుల్లో తిరిగారని ప్రచారం చేస్తారు. అదే నోటితో ఇద్దరూ గొడవపడ్డారట, విడిపోయారట అని అంటారు. ఇప్పుడేమో మా పెళ్లి కూడా చేసేశారు. చూద్దాం.. ఇంకెన్ని వార్తలు వస్తాయో’’ అన్నారు. పెళ్లయిందా? లేదా? అనే విషయానికి మాత్రం సమాధానం చెప్పకుండా దాటేశారు.

No comments:

Post a Comment