అరుంధతిగా ఐశ్వర్యరాయ్?
తెలుగునాట సంచలన విజయం సాధించిన ‘అరుంధతి’ చిత్రం తమిళ, మలయాళ భాషల్లో కూడా అనువాదమైన సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరుంధతి’గా నటించిన అనుష్క ఆ చిత్రం సాధించిన విజయంతో ఎంత పాపులారిటీ సంపాదించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు గ్లామరస్ పాత్రలకే పరిమితమైన అనుష్కలోని నటనా పటిమను చాటి చెప్పిన చిత్రం ఇది. కాగా, ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో త్రీడీ ఫార్మాట్‌లో రీమేక్ చేస్తున్నారని సమాచారం. ఈ రీమేక్‌లో ‘అరుంధతి’ గా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ నటించనున్నారని తెలిసింది.జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో మొదటగా టైటిల్ రోల్‌కు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినాకైఫ్‌ల పేర్లు పరిశీలించారట. కానీ, మహారాణి గెటప్‌లో అరుంధతిగా ఐశ్వర్యరాయే నప్పుతుందని ఆమెను ఎంపిక చేసుకున్నారని సమాచారమ్. ‘అరుంధతి’ చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్‌గా ప్రమోట్ అయిన అనుష్క తరహాలోనే ఐశ్వర్య రాయ్‌కు కూడా ఈ చిత్రం ఆమె కెరీర్‌లో మరపురాని మూవీగా నిలుస్తుందని భావించొచ్చు.
No comments:
Post a Comment