Thursday, November 11, 2010

15న రక్తచరిత్ర-2 పాటలు

15న రక్తచరిత్ర-2 పాటలు
 
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రక్తచరిత్ర’ పార్ట్ 1 ఇటీవల విడుదలైంది. కాగా, ఈ నెలలో రెండో భాగాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సూర్య, వివేక్ ఒబెరాయ్, శతృఘ్న సిన్హా, ప్రియమణి తదితరుల కాంబినేషన్‌లో యదార్థ గాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాలను రూపొందించారు. పార్ట్-1 చూసిన ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను విడుదల చేశారు. ఈనెల 15న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయాలను కుంటున్నారు. ‘‘పార్ట్ 1 కన్నా 2 మరింత విజయం సొంతం చేసుకుంటుంది’’ అని ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు.
 

No comments:

Post a Comment