Monday, November 1, 2010

ఓ రేంజ్ సాహసాలతో ఆరెంజ్

ఓ రేంజ్ సాహసాలతో ఆరెంజ్
తొలి సినిమా ‘చిరుత’. మలి సినిమా ‘మగధీర’. రాబోతున్న మూడవ సినిమా ‘ఆరెంజ్’. మూడూ మూడు రకాల కాన్సెప్ట్స్. దేనితో దేన్నీ పోల్చడానికి లేదు. దటీజ్ రామ్ చరణ్. కథలను, పాత్రలను ఎంచుకోవడంలోనే నటుల ప్రజ్ఞ బయట పడేది. ‘మగధీర’ లాంటి సంచలనం తర్వాత ‘ఆరెంజ్’ లాంటి ఫీల్‌గుడ్ మూవీ చేయాలన్న ఆలోచనే చరణ్‌లోని అభిరుచికి నిదర్శనం. ‘ఆరెంజ్’ చిత్రంలో చరణ్ సరసన జెనీలియా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సాజన్ పదమ్‌సీ కూడా మరో నాయికగా నటిస్తున్నారు. ప్రేమకథలను హృద్యంగా తెరకెక్కించే ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత కె.నాగబాబు మాట్లాడుతూ- ‘‘పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రేమకోసం ఎంతటి సాహసానికైనా తెగించే డైనమిక్ ప్రేమికుడుగా ఇందులో చరణ్ కనిపిస్తాడు. ఈ పాత్రలో ఇంకా చాలా షేడ్స్ ఉంటాయి. ఊహించని రీతిలో ఆ పాత్ర గమనం సాగుతుంది. ఇందులో చరణ్ 14వేల ఎత్తునుంచి స్కై డైవ్ చేశాడు. ఈ సాహసం ఈ చిత్రానికే హైలైట్. చరణ్ నటన, స్టైల్, కథ, కథనం ఇవన్నీ ప్రేక్షకులను రంజింపజేస్తాయి. ఇది చక్కని ఫీల్ గుడ్ మూవీ. మా సంస్థకు, చరణ్‌కు, భాస్కర్‌కు ఈ చిత్రం ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుందని నమ్మకంతో చెప్పగలను. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.
 

No comments:

Post a Comment