Tuesday, November 16, 2010

"బెజవాడ రౌడీలు"గా రామ్‌చరణ్ - అల్లు అర్జున్...?

"బెజవాడ రౌడీలు"గా రామ్‌చరణ్ - అల్లు అర్జున్...?

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ నటించబోతున్న 150వ చిత్రానికి డైరెక్షన్ చేయాలని ఉబలాటపడిన రామ్‌గోపాల్ వర్మ ఆ కోరిక నెరవేరదని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన చిరు కుమారుడు రామ్‌చరణ్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తను ఎంతో కాలంగా కష్టపడి పక్కాగా స్క్రిప్టు సిద్ధం చేసుకున్న "బెజవాడ రౌడీలు" చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో తీస్తే ఎలా ఉంటుందని ఆయన తన సన్నిహితుల వద్ద చర్చించినట్లు భోగట్టా. ఈ చర్చల్లో మరో ఆసక్తికరమైన విషయం ఇంకోటి చోటుచేసుకున్నదట. అదేంటయా... అంటే, బెజవాడ రౌడీల్లోని రెండు వర్గాలు పోటాపోటీగా ఉండాలి కనుక రామ్‌చరణ్ ప్రత్యర్థిగా అల్లు అర్జున్‌ను నటింపజేస్తే చిత్రంపై మరింత క్రేజ్ పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. 

No comments:

Post a Comment