హాట్ హీరోయిన్ కు రోజుకు రూ. 10 లక్షలు
ఇలియానా అంటే దక్షిణాది సినీ పరిశ్రమలో రాను రాను క్రేజ్ పెరుగుతూ పోతోంది. దీనికి కారణం ఇలియానా సినిమా అంటే కుర్రకారు ఎగబడి చూడటమేనన్నది వేరే చెప్పనక్కర లేదు. టాలీవుడ్‌లో తన హవా సాగిస్తున్న ఈ బక్క నడుము చిన్నది ఇపుడు శాండల్‌వుడ్‌లోనూ కాలు పెట్టింది. హీరోయిన్‌గా కాదు.. ఐటమ్ సాంగ్ డ్యాన్సర్‌గా. అయితే ఆ పాటలో పాల్గొన్నందుకు ఇలియానాకు భారీగానే పారితోషికం ముట్టిందని టాలీవుడ్ సినీవర్గాలు చెపుతున్నాయి.అత్యంత సెక్సీగా ఐటమ్‌సాంగ్‌లో తన నాభీ నృత్యాన్ని ప్రదర్శించినందుకు గాను సదరు చిత్ర నిర్మాత ఇలియానాకు రూ. 30 లక్షలు పారితోషికంగా ఇచ్చాడట. కాగా ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణకు కేవలం మూడంటే మూడు రోజులు మాత్రమే పట్టిందట. కనుక ఇలియానా రెమ్యునరేషన్ రోజుకు రూ. 10 లక్షలన్నమాట.
No comments:
Post a Comment