అన్నీ తెలుసుకునే ఇక్కడికొచ్చాను
‘‘బికినీలు ధరించడం, పెదవిని పెదవితో కలపడం... ఇవన్నీ ప్రస్తుత యువతరానికి సహజం. అలాంటప్పుడు అవి సినిమాల్లో హీరోయిన్లు చేస్తే తప్పేంటి...?’’ అని ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ భామ తాప్సీ. తన తొలి చిత్రమైన ‘ఝుమ్మంది నాదం’ సినిమా ద్వారా చక్కని స్టార్‌డమ్‌ని, గ్లామర్ డాల్ ఇమేజ్‌ను తాప్సీ సొంతం చేసుకున్నారు. ఎక్స్‌పోజింగ్ అనే అంశం గురించి పస్తావన వచ్చినప్పుడు ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా తాప్సీ మాట్లాడుతూ- ‘‘సినిమా అనేదే గ్లామరు ఫీల్డ్. ఇక్కడ ఒక స్టేజ్‌కి రావాలంటే... మడికట్టుకొని కూర్చుంటే సరిపోదు. పాత్రోచితంగా, సందర్భానుసారంగా ఎక్స్‌పోజ్ చేయాలి. సూపర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకొని... గొప్ప నటీమణులుగా కీర్తిని ఆర్జించిన తారల్లో... ఎక్కువ శాతం మంది ఎక్స్‌పోజింగ్ చేసినవారే. నేను వారికంటే గొప్పదాన్ని కాదు. పీజీ చేసి నేను ఈ రంగంలోకి వచ్చాను. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు.సినిమా రంగలోని లోటుపాట్ల గురించి పూర్తిగా తెలుసుకొని ఈ రంగంలోకి వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నటికైనా... పరిశ్రమలో స్థిరత్వాన్ని తెచ్చిపెట్టేది గ్లామరే. స్థిరత్వం ఏర్పడిన తర్వాత నటన పరంగా ఎన్ని ప్రయోగాలు చేసినా చెల్లుతుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు తాప్సీ. ఇదిగాక మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న ‘వస్తాడు నా రాజు’ చిత్రంలో కూడా ఆమే నాయిక. తమిళంలో రెండు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారామె.
No comments:
Post a Comment